పరకామణి సేవ మాదిరిగానే లడ్డు ప్రసాద సేవ ప్రవేశపెట్టాలని కోరగా ఈవో ఏం చెప్పారంటే..

టీటీడీ డాష్ బోర్డులో వసతి, దర్శనంకు సంబంధించిన సమాచారం బాగుందని.. లడ్డూల నాణ్యత కూడా పెరిగిందని ఓ భక్తుడు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ప్రశంసలు కురిపించాడు. అలాగే మరో భక్తుడు.. 65 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు క్యూలైన్లో నడవలేరని కావున ప్రత్యేకంగా పంపించాలని కోరడంతో పాటు సుపథం మార్గంలో తాగునీరు, అన్నప్రసాదాలు అందించడం లేదని తెలిపాడు. దీనిపై స్పందించిన ఈవో.. వయోవృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సుపథం వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

పరకామణి సేవ మాదిరిగానే లడ్డు ప్రసాద సేవ ప్రవేశపెట్టాలని ఓ భక్తుడు కోరగా లడ్డూ ప్రసాద సేవను టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు రద్దు చేయడం జరిగిందని ఈవో తెలిపారు. ఆన్‌లైన్‌లో గదులు పొందిన వారికి శ్రీవారి మెట్టు దగ్గర స్కానింగ్ ఏర్పాటు చేయాలని మరో భక్తుడు కోరగా.. సీఆర్ఓ వరకు వెళ్లవలసిన పని లేకుండా, స్కానింగ్ కౌంటర్ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తామన్నారు. అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులు చాలామంది రావడం లేదని. కావున ఆఫ్ లైన్ లో కూడా ఇవ్వాలని ఓ భక్తుడు కోరాడు. అలాగే క్యూలైన్లు ఖాళీగా ఉన్న ఎక్కువ దూరం నుంచి లోపలికి వదులుతున్నారన్నారని తెలిపాడు. అంగప్రదక్షిణం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో ఇవ్వలేమని ఈవో తెలిపారు. క్యూలైన్లలో దగ్గరగా వదిలేలా చర్యలు తీసుకున్నామన్నారు.

Share this post with your friends