వైకుంఠ ద్వార దర్శన ఎస్ఎస్‌డీ టోకెన్లు పూర్తి: టీటీడీ

జనవరి 20వ తేదీన దర్శనానికి తిరుపతిలో ఎస్ఎస్‌డీ టోకెన్లు ఇవ్వబడవని తిరుమల తిరుపతి దేవస్థానం తేల్చి చెప్పింది. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం జనవరి 19వ తేదీ చివరి రోజు కోసం జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో పూర్తి అయ్యిందని టీటీడీ వెల్లడించింది. జనవరి 20న శ్రీవారి దర్శనం కోరే భక్తులు సర్వ దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్‌లో చేరుకుని మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో పాటు, ఆదివారం రానుండడంతో భక్తుల రద్దీ అధికం కానుండడంతో జనవరి 20వ తేదీన సర్వదర్శనం భక్తులు క్యూలైన్లు లోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. జనవరి 20వ తేదీ దర్శనానికి గాను ముందు రోజు అనగా 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయబడవు. అదేవిధంగా జనవరి 20న ప్రోటోకాల్ మినహా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. ఇందువలన ముందు రోజు అనగా 19న విఐపి బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

Share this post with your friends