ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహాకుంభమేళాకు టీటీడీ తరుపున నమూనా ఆలయ నిర్మాణం జరుపుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకూ మహాకుంభ మేళ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు ఈవో శ్రీ శ్యామలరావు ఆదేశాలతో తిరుమల స్వామివారి ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలకు అవసరమైన ఏర్పాట్లు నిర్వహిస్తోంది. ముఖ్యంగా అలాంటి పవిత్ర పుణ్య స్థలంలో స్వామి వారి నమునా ఆలయం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరింత ఆధ్యాత్మికతను పెంచేందుకు టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్‌కు విచ్చేసే అశేష భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పిస్తోందన్నారు.
జనవరి 12వ తేది స్వామివారికి సంప్రోక్షణ చేసి, అచల ప్రతిష్ట తదితర కార్యక్రమాలు.. 13వ తేది నుంచి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలనూ టీటీడీ నిర్వహించనుంది. మహాకుంభమేళ అంటేనే కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తున్న మునులు, సాధువులు పవిత్ర గంగాజలంలో స్నానం ఆచరించి పుణ్యం పొందేందుకు వస్తారని, అలాంటి పవిత్ర స్థలంలో స్వామివారి ఆలయాన్నిఏర్పాటు చేసుకుని స్వామివారి సేవలను భక్తులకు అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి నమూనా ఆలయంలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లను సైతం నిర్వహిస్తోంది.