తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. అలాంటి ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆ రోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించే సుప్రభాతను నిలిపివేయనున్నారు. సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.
డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకూ స్వామివారికి సుప్రభాత సేవ సన్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు. లధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను అర్చకులు నైవేద్యంగా నివేదిస్తారు.