
తిరుమలలో విద్యుత్ దీపాలంకరణపై భక్తులు విశేష ప్రశంసలు కురిపించారు. వైకుంఠ ద్వార దర్శనాల పది రోజుల్లో 33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ జరిగింది. గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోల్చితే ఈసారి 9.29 లక్షల మంది భక్తులకు అదనంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.
తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ జరిపారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడి బాదం పాలు సరఫరా చేశారు. దాదాపు 1000 మంది అన్న ప్రసాదం సిబ్బందితో విజయవంతంగా ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది.
నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పీఏసీ-5 భవనం అందుబాటులోకి రావడంతో భక్తులకు విరివిగా వసతి సదుపాయం కల్పించారు.
సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు అందుబాటులో ఉంచడంతో సౌకర్యవంతంగా గదులు పొందారు. తొలి మూడు రోజులు టోకెన్ కలిగిన భక్తులకే దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు పొందారు. ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీరంగనాధ స్వామి ఆలయ సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో ఏర్పాటు చేసిన అలంకరణలు వైకుంఠాన్ని తలపించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
