తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతూ.. క్యూలైన్‌లోనే..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళుతూ క్యూలైన్‌లోనే భక్తురాలు గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతి చెందిన మహిళ కడప జిల్లాకు చెందిన ఝాన్సీ(32) గా గుర్తించారు. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళుతుండగా.. ఒక్కసారిగా మహిళ కుప్పకూలింది. వెంటనే అక్కడున్న వారు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ వచ్చి ఆసుపత్రికి తరలించే లోపే మహిళ ప్రాణం కోల్పోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో తన కూతురు మృతి చెందిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను వేచి ఉండనక్కర్లేకుండా నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,100 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 20,817 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. తిరుమలలో నేడు వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సర్వదర్శనం భక్తులుకు వారానికి 1.63 లక్షల టోకేన్లు జారి చేస్తున్నట్టు ఈవో తెలిపారు.

Share this post with your friends