తిరుమలకు వచ్చే వాహనదారులు, భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. ప్రస్తుతం తిరుమలలో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. రహదారులన్నింటినీ పూర్తిగా పొగమంచు కప్పేసింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాహనదారులకు కీలక సూచన చేసింది. తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ లో దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు సరిగ్గా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కనుక వాహనదారులు దయచేసి ఘాట్ రోడ్డు లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. పొగ మంచు విపరీతంగా ఉండటంతో జాగ్రత్త వహించాలని సూచించారు. కాగా శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో సోమవారం 47వ కౌంటర్ లో యూపిఎస్ వైర్ కాలడంతో పొగ ఆ ప్రదేశమంతా వ్యాపించింది. వెంటనే అప్రమత్తమై పొగను సిబ్బంది అదుపు చేశారు.