September 2024 Horoscope : సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి మాసఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :

వ్యాపారంలో లాభదాయక ఫలితాలు ఉంటాయి. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు పూర్తికావడానికి వత్తిడి లేకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో పైవారితో వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ఇంటిలో శుభకార్యాలు సూచనలున్నాయి. శ్లోక పారాయణలు కొనసాగించండి.

వృషభం (కృత్తిక 2-4. రోహిణి, మృగశిర 1-2 పాదాలు) :

ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో సంయమనం అవసరం. చాలాకాలంగా వాయిదా పడుతున్న పని పూర్తికావస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. స్థిరాస్తి వ్యవహారాలకు అంత అనువైన మాసం కాదు. సూర్యారాధనతో పాటు రవి, కుజ శ్లోకాలు పఠించండి.

మిథునం (మృగశిర 3-4, అర్థ పునర్వసు 1-3 పాదాలు) :

మనోధైర్యంతో చేసే పనులు శుభాన్నిస్తాయి. సమస్యల పరిష్కారానికి కార్యాచరణతో సత్ఫలితాలు పొందుతారు. నూతన కార్యాలు ప్రారంభించే ముందు సాధ్యాసాధ్యాలు దృష్టిలో పెట్టుకోండి. మాట విలువను కాపాడుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. నెల చివర్లో మేలైన ఫలితాలు పొందుతారు. కుజ, బుధ శ్లోకాలు పఠిస్తే మేలు కలుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు) :

గ్రహయోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. వ్యాపారంలో అంచనాలను చేరుకుంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. సూర్య, కుజ శ్లోకాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కొంత బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. కాలాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అవుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం. వృత్తి ఉద్యోగాల్లో సాధారణం కంటే మంచి ఫలితాలు అందుకుంటారు. నవగ్రహ ధ్యానం మంచిది.

కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్త 1-2 పాదాలు) :

ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అభిష్టాలు నెరవేరతాయి. మీ మీ రంగాల్లో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయం పెంచుకునే ప్రణాళికలు రచిస్తారు. మనోధైర్యంతో మంచి శ్రీ భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ముఖ్య విషయాల్లో అయినవారి సహకారం తీసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థానచలన సూచితం. రవి, బుధ, కుజ శ్లోకాలు పఠించండి.

తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు) :

ఇంట్లో శుభకార్య యోగం. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. అవసరానికి సహాయం చేసేవారున్నారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఉద్యోగపరంగా అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. నెల చివర్లో స్థానచలనం. సూచితం అవుతోంది. కొన్ని అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట) :

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణ సానుకూలతలుంటాయి. ఉన్నత పదవీయోగం ఉంది. ముఖ్య కార్యాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో లాభాలుంటాయి. బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సజ్జన సాంగత్యంతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసరమైన అంశాల జోలికి వెళ్లకండి. రవి, కుజ ధ్యానం చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) :

శక్తికి మించిన పనులు చేయవద్దు. పంతాలకు దూరంగా ఉండండి. పట్టుదలతో శ్రమించాలి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కీలక వ్యవహారాల్లో అవగాహన లోపం వద్దు, నిదానమే ప్రధానం. పాటించాల్సిన విశేష సూచన. గతంలో ఆగిన చెల్లింపులు పూర్తిచేయగలుగుతారు. రవి, కుజ, బుధ, శుక్ర శ్లోకాలు పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు) :

అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. గ్రహయోగం బాగుంది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్య వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం, శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. భూ వాహన కొనుగోలు చేస్తారు. రవి, బుధ ధ్యాన శ్లోకం పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు) :

మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు, అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తుయోగం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవకాశాలు అందిపుచ్చుకోండి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. పాన్ని అదుపులో ఉంచుకోండి. సూర్య, కుజ శ్లోక పఠనం మేలు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) :

గ్రహబలం నామమాత్రం. మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం. కోపాన్ని తగ్గించుకోకపోతే అవకాశాలు చేజారతాయి. మంచి ఫలితాలు సొంతమవ్వాలంటే బద్ధకాన్ని దరిచేరనీయకండి. సహనాన్ని కోల్పోకండి. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనివ్వండి. సమయానికి తగినట్లుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇష్టదేవతారాధన చేసుకోండి.

Share this post with your friends