ఇక్కడి శివయ్యకు భక్తులు ఏం సమర్పిస్తారో తెలిస్తే షాకవుతారు..

భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ప్రతి ఒక్క ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక ఏ ఆలయంలోనైనా భక్తులు తమ కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించుకోవడం సర్వసాధారణం. ఈ మొక్కు డబ్బు రూపంలోనో వెండి, బంగారం వంటి వస్తు రూపంలోనో లేదంటే మరో రూపంలోనో ఉంటుంది. కొన్ని చోట్ల స్వామివారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడం.. ఆలయం చుట్టూ కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం వంటివి కూడా చేస్తుంటారు. కానీ మనం కనీవినీ ఎరుగని విడ్డూరాలు సైతం కొన్ని ఆలయాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే శివాలయంలో కోరిక తీరిన తర్వాత స్వామివారికి ఏం సమర్పిస్తారో తెలిస్తే షాకవుతారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని మొరాదాబాద్‌లోని బహ్జోయికి చెందిన సదత్‌బరి అనే గ్రామంలో ఓ శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఎక్కువగా చర్మ వ్యాధుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు వెళతారు. ఇక్కడి ఆలయంలో మొక్కుకుని స్వామివారికి పాలతో చీపురు సమర్పిస్తే తప్పక చర్మ వ్యాధి నయమవుతుందని నమ్మకం. ఇక శివయ్యకు బాగా ఇష్టమైన శ్రావణ మాసంలో అయితే భక్తుల క్యూ భారీగానే ఉంటుంది. ఇక్కడి శివాలయాన్ని పాతాళేశ్వర్ శివాలయం అని పిలుస్తారు. పాతాళేశ్వర్ ఏంటంటారా? శివలింగం మూలాధారం ఎక్కడో పాతాళంలో ఉందట. శివలింగం లోతును పరీక్షించేందుకు చాలా మంది యత్నించి విఫలమయ్యారట. అదీ పాతాళేశ్వర్ శివయ్య కథ.

Share this post with your friends