ఈ సమయంలో నదీ స్నానం అస్సలు చేయకూడదు.. కారణమేంటంటే..

హిందూమతంలో నదులను పూజించడం పరిపాటే. ప్రముఖ నదులన్నీ భగవంతుడి అవతారాలేనని అంటారు. నదీస్నానం మనలను పాపాల నుంచి బయటపడేస్తుందని నమ్మకం. అయితే మన పాపాలన్నీ తొలగిపోతాయి కదా అని.. నదీ స్నానం నియమాలు, ఆచారాలు పాటించకుండా చేయకూడదు. అన్ని నదుల్లోకి గంగానదిది ప్రత్యేక స్థానం. గంగానది కేవలం నది మాత్రమే కాదు.. గంగా మాత అని భావించడమేనని అంటారు. గంగానదిలో స్నానం చేయడం వలన ఆత్మశుద్ధి చేయడం.. మోక్షం లభిస్తుందని నమ్మకం. మకర సంక్రాంతి, కుంభమేళా, గంగా దసరా వంటి పండుగలలో గంగానదిలో స్నానానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తుందటారు.

నది ఏదైనా సరే.. ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదట. హిందూ మత విశ్వాసాల ప్రకారం నదీ స్నానం నిర్దిష్టమైన సమయంలో మాత్రమే చేయాలి. సూర్యోదయ సమయంలో నదీ స్నానం చేస్తే చాలా మంచిదట. ఇక రాత్రి వేళ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదట. పురాణాల ప్రకారం రాత్రి సమయంలో యక్షులు పవిత్ర నదుల దగ్గర స్నానం చేసి కూర్చుంటారని నమ్మకం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి వేళ నదీ స్నానం ఆచరించకూడదట. యక్షులు అనే వారు.. నీరు, అడవులు, చెట్లు మొదలైన వాటితో సంబంధం ఉన్న ప్రకృతి సంబంధించిన వ్యక్తులు. ముఖ్యంగా యక్షులు రాత్రి సమయంలో చురుకుగా ఉంటారని.. రాత్రి నదుల వద్ద సంచరిస్తారని విశ్వాసం.

Share this post with your friends