డబ్బుంటే డెస్టినేషన్ వెడ్డింగ్ సాధ్యం.. కానీ ఇక్కడ పెళ్లంటే రాసి పెట్టి ఉండాలట..

ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. డబ్బుంటే చాలు మనకు ఎక్కడ చేసుకోవాలనిపిస్తే ఆ ప్రదేశంలో చేసుకోవచ్చు. అయితే డబ్బున్నా కూడా మనకు రాసి పెట్టి ఉంటే మాత్రమే ఒక చోట వివాహం చేసుకోగలం. మరి ఆ ప్రదేశం ఎక్కడుంది? ఇక్కడ చేసుకోవడానికి రాసి పెట్టేంత ఏముంటుందక్కడ? అనే విషయాలను తెలుసుకుందాం. చార్‌ధామ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు. హరహర మహాదేవ శంభో అంటూ ఈ చార్ ధామ్ యాత్ర చేస్తూ ఆనందంలో మునిగిపోతారు.

ఈ చార్‌ధామ్ యాత్రకు వెళ్లే మార్గంలోనే మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. దాని గురించి ఆ యాత్ర నిర్వహించిన ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మనం తప్పక తెలుసుకోవాల్సిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలా మందికి డ్రీమ్‌ వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ అనడంలో సందేహం లేదు. దీనికి కారణమేంటంటే.. ఈ ఆలయంలోనే పార్వతీపరమేశ్వరుల వివాహం జరిగిందట. అయితే ఆ వివాహాన్ని జరిపించింది విష్ణుమూర్తి కాబట్టి ఈ ముగ్గురి గౌరవార్థంగా త్రియుగి నారాయణ్ ఆలయం అని పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ ఆలయం ఉంది.

Share this post with your friends