అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే యాగాలు, హోమాలు చేయనక్కర్లేదు. జపాలు, పూజలు అంతకన్నా అక్కర్లేదు. జగన్మాత కరుణ కోసం కొన్ని నియమాలు పాటిస్తే చాలు. అవేంటో చూద్దాం. ఎవరినీ చూసి అసూయపడకూడదు. ఈర్ష్యా ద్వేషాలను వదిలేయాలి. మనిషిని ఇవి రెండూ ఎదగనివ్వవు. చాడీలు చెప్పడం.. పుకార్లు పుట్టించడం వంటివి చేయకూడదు. ఒకరి బాధకు కారణమైతే వారు సంతోషంగా ఉండలేరట. కొందరు మూర్ఖులను వదిలేయాలి. వారికి ద్వేషం, అసహ్యాన్ని ప్రదర్శించడమే ఏకైక పని. అలాంటి వారిని వదిలేస్తేనే మనకు మంచిది. వారిని మానసిక రోగులుగా పరిగణించి వదిలేయడం ఉత్తమం.
నిజాయతీగా పని చేయాలి.. అలాగే మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే ఆశించాలి. వేరొకరి కష్టాన్ని లాక్కోవడం వంటివి చేయకూడదు. ఆహారాన్ని వృథా చేయకూడదు. నీతి వాక్యాలు చెప్పడం కాదు.. ఆచరించాలి. మాసిన బట్టలు, నిద్ర లేచిన తర్వాత పడకలు తీయకపోవడం, భగవంతుని పటాలు శుభ్రం చేయకపోవడం, గడపకు పసుపు పెట్టక పోవడం, పగిలిన అద్దాలు, ఆగిపోయిన గోడ గడియారాలను ఇంట్లోనే ఉంచడం వంటివి చేయకూడదు. ఆడవాళ్లకు సహనం ఉండాలి. భార్యాభర్తలు ఒకరినొకరు చులకనగా మాట్లాడుకోవడం.. వంటివన్నీ చేస్తే లక్ష్మీదేవి నిలబడదట. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే మనం తప్పక జగన్మాత కరుణా కటాక్షాలు పొందుతామట.