వారాహి మాత గురించి అందరికీ ఎందుకు తెలియదంటే..

వారాహి మాత గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. సప్త మాతృకలలో ఒకరని.. లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలని.. మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వ మంగళ స్వరూపం.. ఆయుధాలతో ఉగ్రరూపంలో కనిపించినా కరుణామయి అని తెలుసుకున్నాం. ఇలాంటి అమ్మవారికి గురించి అందరికీ ఎందుకు తెలియదు? అంటారా? అమ్మవారి గురించి ఓ అపోహ ఉంది. ఈ అమ్మవారిని అందరూ ఆరాధించకూడదట. ఇది నిజంగా అపోహ మాత్రమే. వారాహి మాతను పూజించడానికి వారు వీరనే తేడా లేదు. ఎవరైనా పూజించవచ్చు.

ఇక వారాహి మాత ఆధీనంలోనే అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలు ఉంటాయట. అమ్మను పూజిస్తే వీటి నుంచి మనల్ని రక్షిస్తుందని పండితులు చెబుతుంటారు. నిత్యం మన మనస్సును నియంత్రిస్తూ మనల్ని చాలా ఇబ్బందుల నుంచి బయట పడేస్తుందట. ఈ దీక్ష చేసేవారు బ్రహ్మ ముహూర్తాన లేచి శుచిగా స్నానం చేసి దీక్షా వస్త్రాలు ధరించాలి. దీక్షా వస్త్రాలను ధరించలేని వారు మెడలో కండువాను అయినా వేసుకోవచ్చు. ఇలా 9 రోజుల పాటు దీక్సలో ఉండాలి. నిత్యం అమ్మవారి నామాలు పఠిస్తూ కుంకుమ పూజ చేయాలి. ఎర్రటి పూలతో పూజిస్తూ.. దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించాలి. నేలపైనే పడుకోవాలి. పాదరక్షలను ఈ 9 రోజుల పాటు ధరించకూడదు. మద్యం, మాంసాలను ముట్టకూడదు. అత్యంత నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది.

Share this post with your friends