ఒకప్పుడు గోవిందరాజపురమే నేడు తిరుపతిగా మనకు ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది. దీనికి కారణమేంటంటే… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వడ్డీకాసుల వాడని కూడా పిలుస్తారు. స్వామివారు కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చటం కోసం ద్రవ్యాన్ని కుంచంతో కొలిచి ఇచ్చేవారట స్వామివారు. అయితే ఆ తరువాతి రోజుల్లో స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని పెద్దలు చెబుతారు. గోవిందరాజస్వామి ఆ కుంచం తన తలకింద పెట్టుకున్నాడని ప్రతీతి.
ఇక గోవిందరాజస్వామి ఆలయంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా అన్ని ఆలయాల్లో గర్భాలయంకు ఎదురుగా రాజగోపురం ఉంటుంది. ఇక్కడ మాత్రం గర్భగుడిగా ఎదురుగా కాకుండా ఆలయ సముదాయంలోని మరో ఆలయానికి ఎదురుగా రాజగోపురం ఉంటుంది. రాజగోపురం ద్వారం ఎదురుగా ఉన్న ఆలయం ఎవరది? అంటే.. పార్థసారధి స్వామివారిది. ఇక గోవిందరాజస్వామి విషయానికి వస్తే ఆ విగ్రహాన్ని బంకమట్టితో ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ స్వామివారికి అభిషేకాధి పూజలు నిర్వహిస్తే విగ్రహం కరిగిపోతుంది. కాబట్టి 15 రోజుకోసారి నూనె రాస్తారు.