పూరి జగన్నాథుడు అసంపూర్ణ దేభంతో ఎందుకు దర్శనమిస్తాడంటే..

పూరి జగన్నాథుని ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పూరి జగన్నాథుడి విగ్రహం ఇతర దేవతల విగ్రహాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. పూరి జగన్నాథ ఆలయంలోని విగ్రహం ఎవరికీ అంతుబట్టని ఓ రహస్యం. అసలు ఎందుకు పూరి జగన్నాథుడు ఇతర దేవతల విగ్రహాలకు భిన్నంగా ఉంటాడు? అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు విగ్రహాన్ని ఎప్పుడైనా పరికించి చూశారా? ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథుడు పెద్ద కళ్లతో.. ముక్కుకు రింగు… అసంపూర్ణ శరీరంతో దర్శనమిస్తాడు. పూరి జగన్నాథుడికి కాళ్లు, చేతులు ఉండవు. అందుకే అసంపూర్ణ దేహంతో దర్శనమిస్తాడు అన్నది.

జగన్నాథుడు ఇలా ఎందుకు కనిపిస్తాడంటే.. ఈ ప్రత్యేకమైన రూపం వెనుక అనేక పౌరాణిక కథలు, నమ్మకాలు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. ఇంద్రద్యుమ్న రాజు జగన్నాథుని ఆలయ నిర్మాణానికి పూనుకున్న సమయంలో.. విగ్రహ తయారీ పనులను ఇంద్ర సభలోని సభ్యులతో పాటు దేవతల శిల్పి అయిన విశ్వకర్మకు అప్పగించాడట. అప్పుడు విశ్వకర్మ రాజుకి.. విగ్రహ తయారీ సమయంలో తనను ఎవరూ పిలవరాదని.. అసలు ఆ విగ్రహాలు పూర్తయ్యే వరకూ గదిలోకి ఎవరూ ప్రవేశించరాదని షరతు పెట్టాడట. ఒకవేళ ఈ షరతులు ఎవరైనా మీరితే విగ్రహ తయారీని అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోతానని చెప్పాడట. కండీషన్‌ను రాజు అంగీకరించడంతో విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. రోజూ తలుపులకూ వెలుపల నిలబడి విగ్రహ తయారీ శబ్దాలను వినేవాడట. అయితే ఒకరోజు ఎలాంటి శబ్దాలు వినిపించకపోవడంతో విశ్వకర్మ పని వదిలి వెళ్లిపోయాడనుకుని తలుపు తెరిచాడట. అఅది చూసిన విశ్వకర్మ పనులను అక్కడిక్కడే వదిలేసి వెళ్లిపోయాడట. అందుకే పూరి జగన్నాథుడి విగ్రహం అసంపూర్తిగా ఉంటుంది.

Share this post with your friends