మాస శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం?

హిందూ మతంలో మాస శివరాత్రి పండుగకు చాలా ప్రాముఖ్యముంది. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిధి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాం. శివపార్వతుల ఆశీర్వాదం పొందేందుకు మాస శివరాత్రినాడు ఉపవాసం ఉండి ఆది దంపతులను పూజిస్తూ ఉంటాం. జేష్ఠ మాసంలో మాస శివరాత్రిని ఈ నెల 4వ తేదీ అంటే గురువారం జరుపుకోనున్నాం. అసలు మాస శివరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటాం? అంటే దీనికి ఒక కథ ఉంది. ఈ మాస శివరాత్రి రోజునే పరమేశ్వరుడు.. పార్వతీ దేవిని భార్యగా స్వీకరించాడట. ఇలా మాస శివరాత్రిని జరపుకోవడం వెనుక మరో రెండు కథలు కూడా ఉన్నాయి.

మరొక పురాణం ప్రకారం చతుర్థి తిధి రోజున అంటే మాస శివరాత్రి రోజున సాగర మథనం ప్రారంభమైందని చెబుతారు. ఇదే రోజున దేవతలు, రాక్షసులు కలిసి సాగరాన్ని మథించి అమృతాన్ని వెలికి తీశారట. ఇదొక పెద్ద కథ కానీ ఈ సాగర మథనం మాత్రం ప్రారంభమైంది ఈ రోజేనని అంటారు. మరో కథనం ప్రకారం.. ఒకసారి శివుడికి ఆగ్రహం వచ్చిందట. ఆయన కోపాగ్నికి ప్రపంచమే నాశనం అయ్యే పరిస్థితి రావడంతో వెంటనే స్పందించిన పార్వతీ దేవి.. శివుడిని స్తుతించి ప్రసన్నం చేసుకుందట. అది కూడా జరిగింది ఇదే రోజని అంటారు. కాబట్టి ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్థి రోజున మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు.

Share this post with your friends