గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం? ఎప్పుడు?

ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటాం. అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు జరుపుకుంటాం? ఈ ఏడాది గురు పౌర్ణమి ఎప్పుడు? వంటి విషయాలను తెలుసుకుందాం. మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడి జన్మ దినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. ఈరోజున పూజలు, ఉపవాసం చేస్తే సంతోషం, శ్రేయస్సు లభిస్తాయట. అయితే గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిధి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 21వ తేదీ సాయంత్రం 3:47 గంటలకు ముగుస్తుంది.

పూర్ణిమ తిథి ఎప్పుడు రాత్రి ఉంటుందో ఆ రోజున ఉపవాసం, పూజలు చేస్తారు కాబట్టి 20న గురు పౌర్ణమిని జరుపుకోనున్నాం. 21వ తేదీని పౌర్ణమి మిగులు తిథి అంటారు. ఈరోజు దానధర్మాలకు చాలా మంచిది. గురు పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిని శుభ్రపరిచాలి. ఆ తర్వాత పూజ గదిలో విష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాసుడు విగ్రహాలను ప్రతిష్టించాలి. విష్ణుమూర్తిని పంచామృతంతో అభిషేకించాలి. ఆపై స్వామివారికి పసుపు వస్త్రాలు సమర్పించాలి. అనంతరం దేవుళ్లకు చందన తిలకం పెట్టాలి. గురు చాలీసా పారాయణంతో పాటు గురు పూర్ణిమ వ్రత కథను చదవాలి.

Share this post with your friends