ధన్వంతరి ఎవరు? ఆయనను పూజిస్తే ఏం జరుగుతుంది?

ధన్‌తేరాస్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజున మనం లక్ష్మీదేవి, కుబేరుడితో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తాం. ఇంతకీ ఎవరీ ధన్వంతరి? అనే విషయం తెలుసుకుందాం. ధన్వంతరి జన్మదినాన్ని సందర్భంగా మనం ధనత్రయోదశిని జరుపుకుంటాం. హిందూ పురాణాల ప్రకారం అమృతం కోసం మంథర పర్వతంతో సాగర మథనం కావించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధన్వంతరి అమృతం పాత్రతో ప్రత్యక్షమయ్యాడట. దేవతలు ఆ కలశంలో ఉన్న అమృతాన్ని స్వీకరించి అమరులయ్యారు.

ధన త్రయోదశి నాడు ధన్వంతరిని పూజిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తే ఆర్థిక కష్టాలుండవని చెబుతారు. అయితే బంగారం, వెండి కొనాలంటే సామాన్యులు అందరికీ సాధ్యం కాదు. కాబట్టి వారంతా ఇత్తడి, చీపురు వంటి వాటిని కొనుగోలు చేయవచ్చని చెబుతారు.కుబేరుడు, లక్ష్మీదేవి, ధన్వంతరి చిత్ర పటాలను పెట్టి నెయ్యి దీపం వెలిగించాలి. అనంతరం సాయంత్రం వేళ ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ధన్వంతరికి పసుపు రంగులో ఉండే ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి.

Share this post with your friends