తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ ఎవరెవరు చేయవచ్చు? వివరాలేంటి?

తిరుమలలో అంగప్రదిక్షణ సైతం చేయవచ్చు. శ్రీవారి సన్నిధిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అదో మరపురాని అనుభూతి. వాస్తవానికి దీనికి సంబంధించిన వివరాలు చాలా మందికి తెలియదు. అంగ ప్రదక్షిణ అంటే శరీరంలోని అష్టాంగాలను నేలకు తాకిస్తూ ప్రదక్షిణ చేయడం. శ్రీ వేంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు. అంగ ప్రదక్షిన టికెట్స్ గతంలో తిరుమలలోనే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అవి కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. వీటిని ఉచితంగానే ఇస్తారు. అయితే ఈ టికెట్స్‌ను ప్రతిరోజూ 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగ ప్రదిక్షణ చేసేందుకు స్త్రీ, పురుష భేదం లేదు. ఎవరైనా చేయవచ్చు.

12 సంవత్సరాల లోపు ఉన్నచిన్నపిల్లలకి టికెట్లు అవసరం లేదు . అర్ధరాత్రి తరువాత 1.30 లోపు వైకుంఠం1 దగ్గరకు అంగ ప్రదక్షిణ కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు చేరుకోవాల్సి ఉంటుంది. అంగప్రదిక్షణ కోసం ముందుగా స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేసి.. తడిబట్టలతోనే వైకుంఠం1 క్యూ కాంప్లెక్స్ వద్దకు రావాల్సి ఉంటుంది. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులతో వెళితేనే అనుమతి ఇస్తారు. ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు. అంగప్రదిక్షణ అనంతరం స్వామివారి దర్శనం ఉంటుంది. స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడ నుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం. ఇలా ఉంటుంది శ్రీవారి ఆలయంలో అంగప్రదిక్షణ.

Share this post with your friends