చిదంబరంలోని శివయ్య ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుంటే..

తమిళనాడులోని చిదంబరంలోని శివయ్య ఆలయంలో వింతలూ విశేషాలకు కొదువేం లేదు. ఇక్కడ స్వామివారు నిరాకారుడిగా ఉంటాడని చెప్పుకున్నాం కదా. పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే.. ఇక్కడ పంచభూత లింగాలలో ఆకాశ లింగం ఉంటుందని నమ్మకం. ఆకాశ తత్వానికి ప్రతీకగా భావించే ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం.. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఇవి కనిపించుకుండా పూజారులు ఒక తెరను ఏర్పాటు చేస్తారు.

ఇక అన్ని వేళలా ఈ తెరను తీయరు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే భక్తులకు ఆ తెరను తీసేసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే ‘శివోహంభవ’ అంటే మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం అని అంటారు. దీని అర్థం.. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఈ పుణ్యక్షేత్రం ప్రాధాన్యం ఏంటంటే.. నిరాకార రూపుడై ఉన్న శివయ్యను చూసి మన అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడం.చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెనక్కి వెళుతుంటే దేవాలయ గోపురం మన వీపు వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది.

Share this post with your friends