ఇలా చెప్పారో లేదో.. అలా చేసేశారు..

తిరుమలలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జే శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన తరువాత వినూత్న నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏది అనుకుంటే అది చేసి చూపిస్తున్నారు. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే లడ్డూ నాణ్యత, సామాన్యులకు దర్శనం, రూమ్ ఫెసిలిటి వంటి విషయాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇక తాజాగా ఈవో ఓ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు టీటీడీ నిర్ణయాలు తెలియాలని నిర్ణయించారు.

2023 ఆగష్ట్ 7 వ తేది నుంచి 2024 మార్చి 11వ తేది వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలను అందరికీ తెలిసేలా టీటీడీ వెబ్‌సైట్‌లో పెట్టాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. అలా ఆదేశాలు జారీ చేయడమే ఆలస్యం.. టీటీడీ ధర్మకర్తల మండలి లేదా స్పెసిఫైడ్ అథారిటీలు 10-05-1993 నుంచి 19-06-2023 వరకు తీసుకున్న నిర్ణయాలను ఇదివరకే టీటీడీ వెబ్ సైట్లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్ లోడ్ చేయలేదు. అయితే భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటించడంలో లో భాగంగా 07-08-2023 నుంచి11-03-2024 వరకు ధర్మకర్తల మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుతం టీటీడీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడం జరిగిందని టీటీడీ వెల్లడించింది.

Share this post with your friends