దీపావళి ఒక్కరోజున మాత్రమే తెరుచుకునే అమ్మవారి ఆలయం ఎక్కడుందంటే..

భారతదేశంలో ఎన్నో అద్భుత ఆలయాలున్నాయి. ఎంత ప్రయత్నించినా కనుక్కోలేని మిస్టరీ దేవాలయాలున్నాయి. ఆ ఆలయాల రహస్యాల కారణంగా అవి ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి. ఇక ఓ అమ్మవారి ఆలయం అయితే కేవలం దీపావళి సమయంలో మాత్రమే తెరుచుకుంటుంది. ఈ దేవాలయం ఎక్కడుందో తెలుసుకుందాం. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో బెంగుళూరు నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారిని హసనాంబ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు.

అప్పట్లో దీనిని సిహమసన్‌పురి అని పిలిచేవారు.ఈ ఆలయం అన్ని దేవాలయాల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. దీపావళి సమయంలో ఏడు రోజులు మాత్రమే దీనిని తెరుస్తారు. ఆ తరువాత ఏడాదంతా తలుపులు మూసివేసే ఉంటాయి. దీపావళి సమయంలో ఆలయ ద్వారాలు తెరవగానే అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి జగదాంబను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అమ్మవారు కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తుందని నమ్మకం.

Share this post with your friends