కొబ్బరికాయను భగవంతుని రూపం.. ఎక్కడంటే..

ఈ ఆలయంలో కొబ్బరికాయను భగవంతునిగా పూజిస్తారు. దీనికి కారణమేంటంటే సుబ్రహ్మణ్య స్వామి కొబ్బరికాయలో వెలిశాడు. మరి కొబ్బరి కాయ కొద్ది రోజులుంటే పాడైపోతుంది కదా అంటే కొన్ని దశాబ్దాలుగా ఈ కొబ్బరికాయ పాడుకాలేదట. ఆ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో స్వయంభుగా కపోతేశ్వర స్వామి వెలిశాడని చెబుతారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి ఒక కొబ్బరికాయలో వెలిశాడు. ఈ కొబ్బరికాయకు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఈ కొబ్బరికాయకే పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

కపోతేశ్వర స్వామి ఆలయం చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయం. ఇక్కడ 15 ,16 శతాబ్దాల్లో పల్లవులు శ్రీ కపోతేశ్వర ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఈ కపోతేశ్వర ఆలయ ఆవరణలో నాగలిపులో రాసి ఉన్న శాసనం ఈ గుడి చరిత్రను తెలియజేస్తుంది. రెండు కపోతాలు ఒక వేటగాడు ప్రాణత్యాగానికి ప్రతీకగా శివుడు ఈ ప్రాంతంలో వెలిశాడట. ఈ ఆలయంలో బోయవాడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా శిలా రూపం కూడా మనకు కనిపిస్తుంది. పురాతన నారికేళం పైభాగాన పడగ విప్పిన సర్పరూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సర్పరూపాన్నే సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులు కొలుస్తారు. ఈక్షేత్రం జంట పావురాల రూపంలో శివలింగం వెలిసింది కాబట్టి కపోతేశ్వరాలయం అంటారు.

Share this post with your friends