
కుంతీ దేవి కాస్తా.. గొంతెమ్మగా ఎలా మారిందో తెలుసుకున్నాం కదా.. మరి ఆ గొంతెమ్మ దేవతను కొలుస్తారా? అంటే ఎక్కడో ఏంటి మన ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో కుంతీదేవిని గొంతెమ్మ దేవతగా ఆరాధిస్తారు. వీళ్లు ఆరాధించడానికి ఓ కారణం ఉంది. ‘ఆడవారి నోట నువ్వు గింజ సైతం నానరాదు’ అని కుంతీదేవిని దర్మరాజు శపిస్తాడు. అప్పటి నుంచి ఆ నానుడి సైతం వాడుకలో ఉంది. ఇదెందుకు వచ్చిందో తెలిస్తే కుంతీదేవిని గొంతెమ్మ దేవతగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎందుకు ఆరాధిస్తారో తెలుస్తుంది.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన అనంతరం కౌరవులతో పాటు కౌరవపక్షం వహించిన వారంతా మరణిస్తారు. కర్ణుడు కూడా మరణిస్తారు. అప్పుడు అసలు కర్ణుడు ఎవరనేది ధర్మరాజుకు తెలుస్తుంది. కర్ణుడు తమ అగ్రజుడని, రాజ్యాధికారం పొంది, గౌరవ మర్యాదలు పొందవలసిన వాడని తెలుస్తుంది. తన అన్ననా తాము సంహరించిందని ఆవేదన చెందిన ధర్మరాజు కుంతీదేవిని ‘ఆడవారి నోటిలో నువ్వు గింజ కూడా నానరాదు’ అని శపించాడట. అప్పుడు కుంతీదేవి మనస్తాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింట. అప్పుడు ఆమెకు గిరిజనులు ఆశ్రయం కల్పించారట. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజనులు కుంతీదేవిని తమ ఆడపడుచుగా భావించి పూజలు జరుపుతారు.
