లోహపు తాబేలును ఇంట్లో ఎక్కడ పెడితే కలిసొస్తుంది?

ఆర్థికంగా బాగుంటుందని.. కొన్ని వస్తువులను.. కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకుంటాం. లాఫింగ్ బుద్దా ఇంట్లో ఉంటే ఇల్లంతా ఆర్థికంగానూ.. ప్రశాంతంగానూ ఉంటుందంటారు. అలాగే కొంతమది తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటారు. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తూ ఉంటారు. అందుకే కూర్మావతారం అని కూడా అంటారు. ఇవి గాజుతోనూ.. లోహంతోనూ తయారు చేస్తారు. ఇది ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఎలాంటి లోటూ ఉండదట. అయితే దీనిని కూడా ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. దీనికి కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడ పెడితేనే మనకు ఆర్థికంగా కలిసొస్తుందట. లోహపు తాబేలును ఇంట్లో ఏ దిశలో ఉంచితే మంచిదో చూద్దాం.

లోహపు తాబేలును ఇంట్లో ఉంటే మనపై విష్ణు మూర్తి కరుణ ఉన్నట్టేనట. లోహపు తాబేలును ఇంటికి తెచ్చాక దానిని నీటితో నింపిన పంచలోహపు గిన్నె లేదా ప్లేటులో పెట్టాలి. తాబేలు నీటిలోనే జీవిస్తుంది కాబట్టి ఇలా చేయడం మంచిదని చెబుతారు. దీనిని ఉత్తర దిశలో ఉంచాలట. అలా ఉంచితే ఇంట్లోని వారి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదట. వ్యక్తిత్వ పరంగానూ చాలా బాగుంటారట. ఏ పని మొదలు పెట్టినా విజయాలు సిద్ధిస్తాయట. ముఖ్యంగా లోహపు తాబేలును ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదట. ఇంట్లో నిత్యం పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. ఇంకెందుకు ఆలస్యం వెంటనే లోహపు తాబేలును తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి.

Share this post with your friends