ధన్వంతరి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

ధన్వంతరిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారని ముందుగానే చెప్పుకున్నాం కదా. ఆయుర్వేద పితామహుడిగా పిలుచుకునే ధన్వంతరి ఎలా ఉద్భవించాడో ముందుగా తెలుసుకుందాం. క్షీరసాగరం నుంచి ఒక చేతిలో అమృత కలశంలో మణికుండలాలు ధరించి.. మిగిలిన చేతుల్లో శంఖం, కమలం, ఆయుర్వేద వైద్య గ్రంథంతో క్షీరసాగరం నుంచి ధన్వంతరి ఉద్భవించాడట. సుశ్రుతాచార్యకు ధన్వంతరి శస్త్ర చికిత్సా జ్ఞానాన్ని అందించాడని చెబుతారు. చరకుడు కూడా ధన్వంతరి నుంచే ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడని చెబుతారు. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సంబంధించినదే చరకసంహిత అని కూడా చెబుతారు.

ఇప్పుడు మన దేశంలో ధన్వంతరి దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. మన దేశంలో ధన్వంతరి దేవాలయాలు చాలా అరుదు. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఆవరణలో ధన్వంతరి మందిరం ఉంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించినదని మందిరంలో ఉన్న శిలాఫలకం చెబుతోంది. కేరళలో రెండు ధన్వంతరి ఆలయాలున్నాయి. గురువాయూర్‌.. త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో “నెల్లువాయ” అనే గ్రామంలో ఒకటి.. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో మరో “ధన్వంతరి క్షేత్రం” ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది. ఇతర దేశాలైన జర్మనీ, అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ఉన్నాయి.

Share this post with your friends