హిందూ మతం ప్రకారం గ్రహణ కాలాన్ని అశుభ సమయంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి అవెప్పుడు అనేది ముందుగా తెలుసుకుందాం. ఈ ఏడాది తొలి గ్రహణం ఎప్పుడనేది తెలుసుకున్నాం కదా. తొలి చంద్రగ్రహణం ఈ ఏడాది మార్చి 14వ తేదీన జరగనుంది. ఇక రెండో గ్రహణం ఎప్పుడో తెలుసుకుందాం. ఈ ఏడాది మార్చి 29న అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడంతో పాటు ఇది భారతదేశ ప్రజలకు కనిపించదు. ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, యూరప్ , వాయువ్య రష్యా ప్రజలకు ఈ గ్రహణం కనిపిస్తుంది.
మూడోది చంద్రగ్రహణం.. ఇది పౌర్ణమినాడు ఏర్పడనుంది. సెప్టెంబర్ 7న పౌర్ణమి కావడంతో చంద్రుడు నిండుగా కనిపించనున్నాడు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది అదే రోజు రాత్రి 2:25 గంటల వరకూ ఉంటుంది. ఈ గ్రహణాన్ని భారతదేశ ప్రజలే కాకుండా ఆసియా మొత్తం చూస్తుంది. ఆ సమయంలో ముదురు ఎరుపు రంగులో చంద్రుడు దర్శనమిస్తారు. ఇది యూరప్, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడా సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఇక ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 21-22 తేదీలలో కనిపించనుంది. రెండు రోజుల పాటు ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 21న.. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 22న కనిపించనుంది.