ఈ నెలలో శని ప్రదోష వ్రతం ఎప్పుడు ఆచరించాలి?

హిందూమతంలో ప్రతి రోజుకూ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రదోష వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నెలా త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రత మహిమ గురించి శివపురాణంలో సైతం పేర్కొనబడింది. త్రయోదశి ఉపవాసం నెలకు రెండు సార్లు వస్తుంది. ఆ రోజున ముఖ్యంగా పరమ శివుడిని పూజించుకుని ఉపవాసం ఉంటారు. ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉంటే పరమశివుని అనుగ్రహం లభించి కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మకం. అలాగే ఈ రోజున ఉపవాసం చేసి శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించిన వారి ఇంట సుఖసంతోషాలుంటాయని నమ్మకం.

మరి ఈ ఏడాది తొలి శని ప్రదోష వత్రం ఎప్పుడు ఆచరించాలి? త్రయోదశి ఎప్పుడు రానుందో తెలుసుకుందాం. ఈ ఏడాది తొలి ప్రదోష వ్రతం శనివారం వచ్చింది. కాబట్టి దీనిని శని ప్రదోష వ్రతం అని కూడా పిలుస్తాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శని ప్రదోష వ్రతం జనవరి 11 ఉదయం 8.21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి 12న ఉదయం 6:33 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగను అయినా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఈ శని ప్రదోష వ్రతాన్ని జనవరి 11న ఆచరించనున్నారు.

Share this post with your friends