హిందూమతంలో విశ్వకర్మకు చాలా ప్రాధాన్యత ఉంది. విశ్వకర్మ అద్భుత వాస్తుశిల్పి.. పైగా తొలి ఇంజినీర్. విశ్వకర్మ జన్మదినాన్ని మనం విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటూ ఉంటాము. ఇక ఈ ఏడాది విశ్వకర్మ జయంతి వచ్చేసి ఈ నెల 17న రానుంది. కాబట్టి ఆరోజున మనం ఏం చేస్తాం? విశ్వకర్మ పూజకు శుభ సమయం ఎప్పుడో చూద్దాం. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని ప్రతిపద తిథిలో విశ్వకర్మ జన్మించాడని అంటారు. అయితే విశ్వకర్మను పూజించేందుకు మాత్రం భాద్రపద చివరి తేదీ ఉత్తమమట. అది ఈ నెల 17న రానుంది.
వాస్తవానికి విశ్వకర్మ పూజ పండుగలో మార్పు అనేది ఉండదు. ప్రతి ఏటా ఒకే రోజున పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే పూజ మాత్రం సూర్యుని సంచారాన్ని అనుసరించి ఉంటుంది. విశ్వకర్మ జయంతి రోజున పరిశ్రమలు, కర్మాగారాలు, అన్ని రకాల యంత్రాలకు పూజలు చేస్తారు. ఇక విశ్వకర్మ పూజకు శుభ సమయం మాత్రం ఉదయం 6.07 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 11:43 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో విశ్వకర్మను పూజించుకోవడం వలన ఫలితం చాలా బాగుంటుందట. విశ్వకర్మ ఆశీస్సులు మనకు లభిస్తాయట.