ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడంటే..

2025 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడతాయన్న విషయం తెలిసిందే. మార్చిలోనే రెండు గ్రహణాలు పూర్తయ్యాయి. వాటిలో ఒకటి సూర్యగ్రహణం.. మరొకటి చంద్రగ్రహణం. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 14న సంభవించగా, సూర్యగ్రహణం మార్చి 29న అమావాస్య నాడు సంభవించింది. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు. మరి ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు? అంటే సెప్టెంబర్ 7, 2025న భారత కాలమానం ప్రకారం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 12:23 గంటల వరకూ ఉంటుంది.

ఈ రెండవ చంద్ర గ్రహణం భాద్రపదమాసం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. మరి రెండో చంద్రగ్రహణం అయినా భారతదేశంలో కనిపిస్తుందా? సూతక కాలం మనకు ఉంటుందా? తెలుసుకుందాం. గ్రహణం మన దేశంలోనూ కనిపిస్తుంది కాబట్టి సూతక కాలం ఉంటుంది. గ్రహణానికి 8 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

Share this post with your friends