ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా?

సూర్య గ్రహణానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కవర్ చేయడమే సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం సంభవించినంత సేపు భూమిపై సూర్య కాంతి పడదు. ఇక ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవించింది. కానీ ఇండియాలో ఇది కనిపించలేదు. అగ్రరాజ్యం అమెరికా, దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించింది. ఇక ఏడాది రెండవది అని చెప్పుకున్నా.. చివరిది అని కూడా చెప్పుకున్నా ఒక్కటే. అంటే ఈ ఏడాదిలో ఇంకొక్క గ్రహణం మాత్రమే కనిపించనుంది. మరో సూర్య గ్రహణం ఎప్పుడు సంభవించనుంది? మనకు కనిపిస్తుందా.. లేదా? చూద్దాం.

క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో సంభవించనుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 2 బుధవారం నాడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇక ఈ గ్రహణం ఎంత సేపు ఉంటుందంటే.. భారత కాలమానం ప్రకారం.. అక్టోబర్ 2 రాత్రి 09:10 నుంచి తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. మొత్తంగా సూర్యగ్రహం దాదాపు 6 గంటల 4 నిమిషాల పాటు ఉంటుంది. మరి ఈ సూర్యగ్రహణమైనా భారత్‌లో కనిపిస్తుందా? అంటే ఇది కూడా కనిపించదు. ఎందుకంటే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి కనిపించే అవకాశమే లేదు.

Share this post with your friends