షట్ తిల ఏకాదశి ఎప్పుడు? దాని ప్రాధాన్యతేంటి?

హిందూమతంలో ఏకాదశి తిథులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తుంటాయి. దేని ప్రాముఖ్యత దానిదే. ముఖ్యంగా ఏకాదశి నాడు విష్ణుమూర్తి, లక్ష్మీ దేవిని పూజిస్తే ఫలితం చాలా బాగుంటుందట. ఈ ఏకాదశులతో అత్యంత ప్రాధాన్యత కలిగినది షట్ తిల ఏకాదశి. ఇది పుష్య మాసం బహుళ పక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీ దేవిని పూజించి ఉపవాసముంటే ఫలితం మరింత బాగుంటుందట. మరి ఈ నెల ఎప్పుడు మనం షట్ ఏకాదశిని జరుపుకోబోతున్నామో తెలుసుకుందాం.

ఈ నెల 25న మనం షట్ తిల ఏకాదశిని జరుపుకోనున్నాం. ఈ తిథి చాలా విశిష్టమైనదట. అందుకే దీనిని విమలైక ఏకాదశి, సఫలైక ఏకాదశి, కల్యాణ ఏకాదశి అని పిలుస్తారట. షట్ అంటే ఆరు.. తిల అంటే నువ్వులు అని అర్థం. నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించే ఏకాదశి కాబట్టి దీనిని షట్ తిల ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున ఎవరైతే నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తారో వాలికి శనిదేవుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. శని విష్ణు భక్తుడు కాబట్టి ఆయన ఆశీస్సులు లభిస్తాయట.

Share this post with your friends