
హిందువులకు ఎప్పుడూ ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. దసరా వెళ్లిపోయింది. ఇక తర్వాత వచ్చేది దీపావళి పండుగే కదా అంటే.. ఈ పండుగను చాలా ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఐదు రోజుల పాటు నిర్వహించే పండుగలలో ధన్‌తేరాస్ ఒకటి. ధనత్రయోదశిని ఉత్తర భారతదేశంలో ధన్‌తేరాస్ అని పిలుస్తారు. ఈ ధన్‌తేరాస్ నాడు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజిస్తారు. ఇలా పూజించడం వలన ఆర్తిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం.
ధన్‌తేరాస్ నాడు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించుకుంటారు. ఇవాళ ప్రతి ఒక్కరూ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి ధనత్రయోదశి ఎప్పుడో తెలుసుకుందాం. త్రయోదశి తిథి మంగళవారం అక్టోబర్ 29వ తేదీ 2024 ఉదయం 10:31 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే అక్టోబర్ 30, 2024 బుధవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ముగుస్తుంది. మనం ఉదయం తిథి ప్రకారం పండుగను జరుపుకుంటాం కాబట్టి ధనత్రయోదశి పండుగను అక్టోబర్ 29న జరుపుకోవాలి. ఇక 29న పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే.. సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకూ ఉంటుంది.
