అన్నపూర్ణ జయంతి ఎప్పుడు? ఆ రోజున ఏం చేస్తే మంచిది?

హిందూమతంలో ఎన్నో ప్రత్యేక దినాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక దినాల్లో చెప్పుకోదగినది అన్నపూర్ణ జయంతి. ఈ రోజు అన్నపూర్ణాదేవికి అంకితం ఇవ్వడం జరిగింది. అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని పూజించిన వారి ఇల్లు సుఖశాంతులతో సంతోషంగా ఉంటుందట. ఈ రోజు చేసే పూజకు మాత్రమే కాదు దానాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం అంత ప్రాధాన్యమిచ్చే అన్నపూర్ణ జయంతి ఎప్పుడు? ఆ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం అన్నపూర్ణ జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రోజున వస్తుంది. ఈ సంవత్సరం మార్గశిర పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందనే దాన్ని బట్టి అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటాం. మార్గశిర పౌర్ణమి తిథి డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగను అయినా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఉదయతిథి ప్రకారం అన్నపూర్ణ జయంతిని డిసెంబర్ 15వ తేదీన జరుపుకోనుం. ఈ రోజున నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తే చాలా మంచిదట. ముఖ్యంగా ఈ రోజున అన్నదానం చేస్తే ఆ ఇంట ఆహారానికి ఎలాంటి లోటూ ఉండదట.

Share this post with your friends