మీనరాశిలోకి బుధుడు ఎప్పుడు ప్రవేశిస్తాడు?

గ్రహాల సంచారంపై మన స్థితిగతులు ఆధారపడి ఉంటాయంటారు. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి పెద్ద పీట వేయడం జరిగింది. జాతకమంతా గ్రహాల సంచారంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి గ్రహం సంచారం మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంటోంది. ముఖ్యంగా నూతన సంవత్సరంలో గ్రహ సంచారం అత్యంత కీలకమైనదిగా పరిగణించబడుతోంది. 2025 సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాలకు యువరాజుగా పేర్కొనే బుధుడు, రాహువుల కలయిక జరగనుంది. ఈ క్రమంలోనే మీనరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. అదెప్పుడో తెలుసుకుందాం.

మీనరాశిలోకి బుధుడు ప్రవేశించాడంటే కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ప్రస్తుతం మీనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి 27, 2025న మీనరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి 11:46 నిమిషాలకు మీనరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బుధుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే రాహువు, బుధుని కలయిక కూడా ఏర్పడనుంది. ఇలా కలయిక ఏర్పడటం వలన మొత్తంగా 12 రాశుల వారు ప్రభావితులవనున్నారు.

Share this post with your friends