శివునికి ఇవాళ రుద్రాభిషేకం చేయాలనుకున్నవారు ఏం చేయాలంటే..

శివునికి ఇవాళ ఆషాడ మాస శివరాత్రి కాబట్టి రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిదని తెలుసుకున్నాం కదా.. కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయాలనుకున్నవారు ఏం చేయాలో తెలుసుకుందాం. నేటి సాయంత్రం శివుడికి రుద్రాభిషేకం చేయడానికి ముందుగా గణేశుడిని ధ్యానించండి. శివపార్వతులను, నవగ్రహాలను ధ్యానించి అనంతరం రుద్రాభిషేకం చేయండి. తరువాత మట్టితో శివలింగాన్ని సిద్ధం చేసి, ఉత్తర దిశలో ఒక పీఠంపై ప్రతిష్టించి రుద్రాభిషేకం చేసే వ్యక్తి తూర్పు ముఖంగా ఉండి అప్పుడు ప్రారంభించాలి. ముందుగా శివలింగాన్ని గంగాజలంతో శుద్ధి చేసి.. ఆ తరువాత చెరుకు రసం, పచ్చి ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదారతో శివలింగానికి అభిషేకం చేయండి.

అభిషేకానికి ముందు, తరువాత పవిత్ర జలం లేదంటే గంగా జలాన్ని ప్రతి పదార్థంతోనూ జత చేయాలి. ఇక మీరు తెచ్చుకున్న పువ్వులు, పండ్లు అన్నీ శివయ్యకు సమర్పించండి.
శివ కుటుంబంతో సహా దేవతలందరినీ పూజించి.. ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. చివరిగా హారతి ఇచ్చి శివయ్యకు మనసులో కోరిక తెలియజేయండి. రుద్రాభిషేకం సమయంలో సమర్పించే వాటన్నింటినీ ప్రసాదంగా స్వీకరించండి. ఇక ఇవాళ దేవాలయాల్లో కానీ.. నదీ తీరాల్లో కానీ దీప దానం చేస్తే చాలా మంచిదట. ఆ వ్యక్తి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందట. కష్టాలన్నీ దూరమై జీవితం ప్రశాంతంగా ఉంటుందట.

Share this post with your friends