
ధన్‌తేరాస్ నాడు స్తోమత ఉన్నవారు బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. వేరే వస్తువులను కొన్నా కూడా అంతే ప్రయోజనం లభిస్తుంది. ధన్‌తేరాస్‌ను అక్టోబర్ 18న జరుపుకోనున్నాం. ధన్‌తేరాస్ నాడు అప్పట్లో అయితే కొత్త పాత్రలు కొనుగోలు చేసేవారట. దీనికి కారణమేంటో తెలుసుకున్నాం కదా. ఈ రోజున ధన్వంతరి అమృతం పాత్రతో దర్శనమిచ్చాడు కాబట్టి ఈ రోజున పాత్రలు కొంటారు. ఈ రోజున ఇత్తడి పాత్రలు కొంటే ఆరోగ్యంతో పాటు అదృష్టమట. రాగి లేదంటే కాంస్య పాత్రలను కొనడం మంచిది. అలాగే చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి చీపురు కొనుగోలు చేసినా మంచిదేనట.
అయితే చీపురును కొని ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత.. చీపురుని పూజించిన మీదటే వాడాల్సి ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి ధనియాలను సమర్పించినా కూడా మంచి జరుగుతుందట. ధనియాలను డబ్బు దాచే ప్రదేశంలో ఉంచితే మంచి జరుగుతుంది. దీపావళి నాడు లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ధన త్రయోదశి రోజున ఇంటికి తీసుకు వచ్చి దీపావళి నాడు సంపద, శ్రేయస్సు లభిస్తుందట. శ్రీయంత్రం, కుబేర యంత్రాన్ని కొనుగోలు చేసినా మంచిదేనట. గోమతి చక్రాలను పవిత్రమైనవిగానూ.. అద్భుతంగానూ భావిస్తారు. 11 గోమతి చక్రాలను కొని.. వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి పెడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. గవ్వలను ఈ రోజున పూజించినా మంచి జరుగుతుందట. అలాగే నల్లటి వస్తువులు లేదంటే దుస్తులు కొనకూడదు.
