జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నాయి. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే మొత్తం 9 గ్రహాలతో పాటు 12 రాశులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ నవ గ్రహాలు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్క రాశిలోనూ సంచరిస్తూ ఉంటాయి. వాటి పరిణామాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహ దోషాలనేవి మనషుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో పాటు వృత్తి పరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం క్షీణించడం వంటివి మనుషులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. గ్రహ దోషాలకు ఏం చేయాలో తెలుసుకుందాం.
సూర్య దోషం: జాతకంలో సూర్యుడి చెడు స్థితిని సరిచేయడానికి నిత్యం మనం నిద్ర పోయే ముందు మంచం కింద నీటితో నింపిన రాగి పాత్రను ఉంచాలి. అలాగే ఎర్రచందనాన్ని గుడ్డలో కట్టి దిండు పెట్టుకోవాలి.
చంద్ర దోషం: చంద్ర దోషం నివారణకు మంచం కింద నీటితో నింపిన వెండి పాత్రను ఉంచితే పరిస్థితి మెరుగుపడుతుంది.
మంగళ దోషం: ఈ దోషానికి మంచం కింద నీటితో నిండిన కాంస్య పాత్రను ఉంచాలి. దిండు కింద బంగారం లేదా వెండితో చేసిన కొన్ని ఆభరణాలను ఉంచండి.
బుధ దోషం: జాతకంలో బుధ దోషం ఉన్నట్లయితే.. రాత్రి సమయంలో దిండు కింద బంగారు ఆభరణాలను ఉంచాలి.
గురు దోషం: పసుపు ముద్దను శుభ్రమైన గుడ్డలో కట్టి రాత్రి సమయంలో దిండు కింద పెట్టుకోవాలి.
రాహు దోషం: జాతకం నుంచి రాహువు స్థానాన్ని సరిచేయడానికి ప్రతిరోజూ నుదుటిపై తిలకం దిద్దుకుంటే ఉపయోగం ఉంటుంది.
కేతు దోషం: రెండు రంగుల కుక్కకు ఆహారాన్ని అందిస్తే కేతు దోషం తొలగుతుంది.
శుక్రగ్రహ దోషం: వెండి చేపను తయారు చేసి దిండు కింద ఉంచి నిద్రిస్తే దోషం పోతుంది.
శని దోషం: శనీశ్వరుడికి ఇష్టమైన రత్నం నీలాన్ని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే శనిదోషం తొలగిపోతుందట.