ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉండాలి? ఏవి ఉండకూడదు?

మన ఇంట్లో ఉంచిన ప్రతిదీ మన జీవితంలో శుభ లేదా అశుభ ఫలితాలను చూపిస్తూనే ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ పని మొదలు పెట్టినా కూడా కాస్త మంచి చెడులు ఆలోచిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణం. ఇంట్లో ప్రతి వస్తువునూ వాస్తుకు అనుగుణంగానే అమర్చుకుంటాం. అయితే కొన్ని సార్లు మనకు తెలియకుండానే పనికిరాని వస్తువులను ఇంట్లోనే ఉంచుతుంటాం. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందట. తెలిసీ తెలియక చేసే తప్పులే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయట. కాబట్టి అలాంటి వాటిపై తప్పని సరిగా శ్రద్ధ పెట్టాలి. ఏం చేస్తే మంచిది? ఏం మంచిది కాదో చూద్దాం.

వాస్తు ప్రకారం ఇంటి కిటికీలు లేదా తలుపులపై సెలనైట్ రాళ్లను ఉంచాలి. అప్పుడు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదట. ఇంట్లో ఉపయోగించని వస్తువులను ఏమాత్రం ఉంచకూడదు. అవి వెంటనే తీసి పడేయాలి. ఈశాన్య దిక్కు శుభప్రదం.. పైగా దేవుడు కొలువుండే ప్రదేశం కాబట్టి ఇక్కడ బరువైన వస్తువులను పెట్టకూడదట. అలాగే తుప్పు పట్టిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదట. ఆగిపోయిన గడియారాన్ని వెంటనే ఇంట్లో నుంచి తీసివేయాలట. అలాగే మన ఇంట్లోని గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

Share this post with your friends