కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఎలా ఉంటుందంటే..

హిందువులు చాలా మంది ఉదయం లేవగానే సూర్యోదయం లోపు శుచిగా స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిస్తారు. సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా భావించి పూజించుకుంటాం. ఇతర దేవతలందరినీ మనం చిత్ర పటాల్లోనే చూస్తుంటాం కానీ ప్రత్యక్ష దైవమైన సూర్యుని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాగే సూర్యుని అనుగ్రహం కూడా సూర్యకాంతి రూపంలో మనం పొందుతూనే ఉంటాం. దేశంలో సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన దేవాలయాలు ఐదు ఉన్నాయి. వాటిలో కోణార్క్‌లోని సూర్య దేవాలయం అత్యంత కీలకమైనది.

అయితే ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం నుంచి గుజరాత్‌ మోధేరాలోని సూర్య దేవాలయం నడుమ సూర్యునికి సంబంధించిన ఐదు గొప్ప ఆలయాలున్నాయి.వాటిలో కోణార్క్ సూర్య దేవాలయం గురించి వివరంగా తెలుసుకుందాం.కోణార్క్ సూర్య దేవాలయంలోని శిల్పకళా అద్భుతం చూడటానికి రెండూ కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ఆలయ నిర్మాణం ఏడు గుర్రాలతో ఉండే సూర్య భగవానుడి రథంతో కూడి ఉంటుంది. ఈ రథానికి 24 చక్రాలు ఉంటాయి. ఆ రథాన్ని లాగుతున్నట్టు 7 గుర్రాలుఉంటాయి. ఈ ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు ప్రతీకలని చెబుతారు. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి.

Share this post with your friends