ఉప్పిలి అప్పన్ కథేంటి? ఉప్పు లేని నైవేద్యం ఎందుకు?

తమిళనాడులోని తంజావూరులో వెలిసిన ఉప్పిలి అప్పన్ కథేంటి? ఏ ఆలయంలో లేనిది ఈ ఆలయంలో మాత్రమే అసలు ఆయనకు చప్పిడి నైవేద్యం ఎందుకు పెడతారో తెలుసుకుందామా? మార్కండేయుడు మహా శివ భక్తుడు. ఆయన లోక సంచారం చేస్తూ తంజావూరు సమీపంలోని తిరువ్విన్నగరం వచ్చాడు. అక్కడే శ్రీ మహాలక్ష్మీ కోసం వేల ఏళ్లపాటు తపస్సు చేశాడు. సంతోషించిన శ్రీ మహాలక్ష్మి.. పసిపాప రూపంలో ఆయన వద్దకు వచ్చింది. ఆ పసిపాను చూశాక మార్కండేయుడు తపస్సు విరమించి పాపను అల్లారు ముద్దుగా పెంచుకోసాడు. ఒకరోజు ఆయన వద్దకు శ్రీ మహావిష్ణువు వృద్ధుని రూపంలో వచ్చాడు.

ఆ బాలికను ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. దానికి మార్కండేయుడు ససేమిరా కాదంటాడు. నువ్వేమో ముసిలివాడివి. పాపేమో చిన్న పిల్ల. కనీసం వంటలో ఉప్పు సరిగా వేయడం కూడా తెలియదని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం ఫర్వాలేదు. పాప ఉప్పు లేకుండా వంట చేసినా కూకడా నేను తింటానని చెప్పాడు. అంతేకాదు.. బాలికను వివాహం చేసుకోకుండా అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించాడు. అప్పుడు మార్కండేయుడు అసలు వచ్చిందెవరని తన దివ్యదృష్టితో చూసి మార్కండేయుడని తెలుసుకున్నాడు. ఆ వెంటనే విష్ణుమూర్తి తన నిజరూప దర్శనంతో మార్కండేయుని ముందు ప్రత్యక్షమయ్యాడు. మరేమీ ఆలోచించక మార్కండేయుడు విష్ణుమూర్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. మార్కండేయుని కోరికి మేరకు లక్ష్మీ సమేతుడై ఉప్పిలి అప్పన్‌గా విష్ణుమూర్తి అక్కడే వెలిశాడు. ఇక అప్పటి నుంచి స్వామివారికి నైవేద్యంగా ఉప్ప లేకుండా సమర్పిస్తున్నారు.

Share this post with your friends