మత్తితలేశ్వర్ ఆలయ కథ ఏంటంటే..

కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లి తాలూకాలోని కల్లు వీరన హళ్లిలోని మఠితలేశ్వర దేవాలయం గురించి తెలుసుకున్నాం. ఇక్కడి మట్టి సైతం మనకు మంచి చేస్తుంది. మఠితలేశ్వరాలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆది, గురువారాలైతే ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయం మద్ది చెట్టు కింద ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి మఠితలేశ్వరాలయం అని పేరు వచ్చింది. అలాగే శివయ్యకు మత్తితలేశ్వర్ అని పేరు వచ్చింది. ఇక ఈ ఆలయ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం.

పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో అపర శివభక్తుడైన ఒక సాధువు నివసించేవాడట. ఆయన మద్ది చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండేవాడట. దీంతో సాధువు చుట్టూ ఒక చీమ పుట్ట ఏర్పడిందట. అక్కడికి ఓ ఆవు రోజూ వచ్చి పుట్ట దగ్గర తను పొదుగు నుంచి పాలు కార్చేదట. ఒకరోజు గ్రామ పెద్ద దానిని గమనించి పుట్ట దగ్గరకు వెళ్లి చూడగా శివలింగం కనిపించిందట. ఆ తరువాత గ్రామ పెద్దకు కలలో శివలింగం కనిపించి తాను ఆ ప్రదేశంలో స్థిరపడతానని చెప్పాడట. అక్కడే ఆలయాన్ని నిర్మించారట. మద్ది చెట్టు కింద వెలిశాడు కాబట్టి శివయ్యను మత్తితలేశ్వర్ అని పిలుస్తున్నారు.

Share this post with your friends