జయ ఏకాదశి కథ ఏంటి?

ఇవాళ జయ ఏకాదశి. మాఘమాసం శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే దీనిని భూమి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. జయ ఏకాదశి ప్రాముఖ్యతను పద్మ పురాణం, భవిష్యోత్తర పురాణాలలో వివరించారు. ఈరోజున ఉపవాసం పాటిస్తే చాలా మంచి జరుగుతుందట. ఇలా చేస్తే బ్రహ్మ హత్య వంటి మహాపాతకాలను కూడా వదిలించుకోవచ్చట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరుడికి వివరించాడు. జయ ఏకాదశి గురించి ఆసక్తికర కథ ఒకటుంది. అదేంటో తెలుసుకుందాం. నందనవనంలో జరగుతున్న ఉత్సవానికి దేవతలు, పరిపూర్ణ సాధువులు, దైవీ పురుషులు హాజరయ్యారు. అక్కడ మాల్యవనుడనే గంధర్వుడు పాడుతుందగా.. పుష్పవతి అనే గంధర్వ బాలిక నృత్యం చేస్తోంది.

ఈ క్రమంలోనే పుష్యవతి కళ్లు మాల్యవనుడిపై పడటంతో అతని పట్ల ఆకర్షితురాలై సభా మర్యాదను మరిచి నృత్యం చేయడం ఆరంభించింది. సద్గుణవంతురాలైన గంధర్వ బాలిక సంజ్ఞను చూసి, అతను తన మనస్సు చలించి పాటలో శ్రావ్యత పోయింది. దీనికి ఇంద్రుడు కోపించి పుష్యవతి, మాల్యవంతులను స్వర్గం వదిలి భూమిపై పిశాచాలుగా నివసించాలని శపించాడు. దీంతో ఇద్దరూ పిశాచాలుగా మారి హిమాలయ పర్వతంపై ఉన్న ఒక చెట్టుపై నివాసం ఏర్పరుచుకున్నారు. రాత్రి సమయంలో చలి కారణంగా రాత్రంతా మేల్కొని ఉండేవారు. జయ ఏకాదశి నాడు వీరిద్దరూ అనుకోకుండా ఉపవాసం ఉండటంతో పిశాచ జన్మ నుంచి విముక్తి పొందారు. తిరిగి పుష్పవతి, మాల్యవంతులకు స్వర్గంలో స్థానం లభించింది. వారిని స్వర్గంలో చూసిన ఇంద్రుడు ఆశ్చర్యంతో పిశాచ యోని నుంచి విముక్తి ఎలా లభించిందని అడిగాడు. దీనికి జయ ఏకాదశి ప్రభావమని చెప్పారు. వారిని స్వర్గంలో సంతోషంగా జీవించాలని ఇంద్రుడు చెప్పాడు.

Share this post with your friends