కడలి కపోతేశ్వరాలయం విశిష్టత ఏంటంటే..

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో స్వయంభువుగా వెలిసిన కపోతేశ్వర ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఒక కొబ్బరికాయలో పడగ విప్పిన సర్పరూపంలో స్పష్టంగా దర్శనమిస్తాడు. ఈ కొబ్బరికాయను కొన్ని దశాబ్దాలుగా పూజిస్తున్నారు. ఇక కపోతం అంటే పావురం ఈ క్షేత్రంలో జంటగా వెలిసిందట. ఇక్కడి శివలింగంపై జంట పావురాల రెక్కల ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ శివలింగంతో పాటు నాగేంద్రుడు నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న కొలను కపోతగుండంగా ప్రసిద్ధి చెందింది.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కాశీలోని గంగాజలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఇక్కడి వారి విశ్వాసం కాబట్టి ఈ గుండానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్ర సహిత బాలత్రిపుర సుందర దేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందట. ప్రతి మాఘమాసంలో ఆదివారం నాడు ఇక్కడి గుండంలో మారేడు దళాలను వేస్తారు. అలా చేస్తే మారేడు దళాలు మునిగిపోతాయట. ఈ కపోత గుండంలో స్నానమాచరిస్తే కపోతేశ్వరుని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందట.

Share this post with your friends