
హిందువులు తమ ఇళ్లలో సైతం శంఖాన్ని ఉంచుతారు. పూజ గదిలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ శంఖం ఉంటుంది. అసలు ఇంట్లో శంఖం ఉంచితే ఏం జరుగుతుంది?
అనేది తెలుసుకుందాం. ఇంట్లో శంఖం ఉంటే లక్ష్మీదేవి కృప ఉంటుందని పండితులు చెబుతారు. దీని వెనుక ఉన్న భావమేంటంటే.. శంఖం అనేది శుభ శక్తికి సంకేతం. స్వచ్ఛత, సాత్వితకత అనేవి శంఖంతోనే సాధ్యంత అందుకే పూజ గదిలో దేవుడి దగ్గర శంఖాన్ని ఉంచుతారు. హిందూ పురాణాల్లో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెబుతారు. దాని గురించి కూడా తెలుసుకుందాం.
హిందూ పురాణాల్లో విష్ణువు చేతిలో శంఖం ఉంటుంది. కృష్ణుడు ఊదే పాంచజన్య కూడా శంఖమే కావడం విశేషం. అంతేకాదు… యుద్ధంలో సైతం శంఖం పూరించాకే ప్రారంభమవుతుంది. అలాగే ముగుస్తుంది. ఇవన్నీ ఒకే సంకేతాన్ని ఇస్తాయి. “ధర్మం ఎక్కడైతే ఉందో.. అక్కడే శంఖనాదం ఉంటుంది” అని. ఇక శంఖం ఊదేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటంటే.. శంఖం ఊదేవారు పరిశుభ్రంగా ఉండాలి. పూజకు ముందు చేతులు కడుక్కోవాలి. సరైన సమయాల్లో మాత్రమే ఊదాలి. ఆటగానో లేదంటే నిర్లక్ష్యంగానో శంఖం ఊదకూడదు. ఎందుకంటే శంఖం అనేది ఆట వస్తువు కాదు.. పతిత్రమైన వస్తువు.
