విశ్వకర్మ జయంతి రోజున పూజా విధానం ఏంటి?

విశ్వకర్మ భగవానుడి జయంతి ఎప్పుడు? పూజకు ఏ సమయం మంచిదనే విషయాలను తెలుసుకున్నాం. ఇక ఈ నెల 17వ తేదీన విశ్వకర్మ జయంతిని జరుపుకున్నాం. హిందూ వైదిక క్యాలెండర్ ప్రకారం ఉదయం 6.07 నుంచి 11.43 వరకూ పూజ నిర్వహించుకోవచ్చు. ఇక పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. విశ్వకర్మ పూజ రోజున, ఉదయాన్ని నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి. అనంతరం ఇంట్లో ఉన్న యంత్రాలన్నింటిని శుభ్రం చేయాలి. ఆ తరువాత ఒక పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై విశ్వకర్మ విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి.

ఆ తరువాత మన ఇంట్లో ఉన్న యంత్రాలతో పాటు వాహనాలన్నింటికీ పసుపు, కుంకుమ, గంధం రాయాలి. ఇక ఆ తరువాత యంత్రాలతో పాటు మన ఇంట్లో ఉన్న వాహనాలన్నింటినీ పూజించాలి. వాహనాలన్నింటికీ పూల మాలలు వేయాలి. ఆ తరువాత విశ్వకర్మకు ఐదు రకాల పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యంలో బూందీ, బూందీ లడ్డు ముఖ్యంగా ఉండేలా చూసుకోవాలి. అనంతరం విశ్వ కర్మ భగవానుడి కథ చదవాల్సి ఉంటుంది. కథ పూర్తైన అనంతరం విశ్వకర్మకు హారతి ఇస్తే పూజ పూర్తయినట్టే.

Share this post with your friends