వాసుకి కాలసర్ప దోషం అంటే ఏంటి? దానికి ఏం చేయాలి?

వ్యక్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడంటే దానికి జాతక దోషం కూడా కారణం కావొచ్చు. వ్యక్తి జన్మించిన సమయంలో గ్రహాలు, నక్షత్రాల స్థానం కారణంగా.. అతను ఏదో ఒక దోషంతో బాధపడుతూ ఉంటాడని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అయితే ప్రతి దోషానికి ఒక పరిష్కారం అయితే ఉంటుంది. అలాంటి దోషాలలో వాసుకి కాల సర్ప దోషం ఒకటి. వాసుకి కాల సర్ప దోషం ఎప్పుడు వస్తుంది? అది ఎంత ప్రమాదకరం? ఆ దోష నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. జాతకంలో మూడవ ఇంట్లో రాహువు, తొమ్మిదవ ఇంట్లో కేతువు ఉన్నప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుందట. ఈ దోషం ఉంటే ఇంట్లో కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయట.

కుటుంబ సమస్యలు వేధించడంతో పాటు ఉద్యోగాల్లో బాధలు, పదోన్నతిలో ఆటంకాలు, ఉద్యోగం పోవడం వంటి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాసుకి కాల సర్ప దోషాన్ని వెంటనే తొలగించుకోవాలి. మరి ఈ దోషంతో బాధపడేవారు ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా హనుమాన్ చాలీసా చదవాలని జ్యోతిష్యులు నమ్ముతారు. అలాగే వాసుకి కాలసర్ప దోషంతో బాధపడేవారు.. ప్రతి మంగళవారం ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. అంతే కాదు రాహు, కేతువుల బీజ మంత్రాన్ని జపించడంతో పాటు రోజూ శివుని పూజించాలి. అలాగే శివయ్యను ప్రసన్నం చేసుకుంటే ఈ దోషం నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Share this post with your friends