హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని క్షేత్రంలో కొలువైన వీరభద్ర స్వామి గురించి తెలుసుకున్నాం. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే.. సా.శ.1600వ సంవత్సరం కాలంలో వంట చెరుకు కోసం కొందమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారు. వంట చెరుకు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు నిద్రపోయారు. కాసేపటి తరువాత లేచి చూడగా, ఎడ్లు కనబడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయిని చెప్పాడట.
గుట్టకింద దూది మెత్తలలో విగ్రహాన్ని ఉంచి వీరభద్రస్వామిని ప్రతిష్ఠించినట్లు, ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళ మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరించి 27 రోజులు దీక్షలు చేపడతారు.