మైసూర్ దసరా గోల్డ్ కార్డ్ ప్రత్యేకత ఏంటి?

మైసూర్ దసరా భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్ర పండుగ . దీనిని పది రోజుల పాటు నిర్వహిస్తారు. నవరాత్రి పేరిటి తొమ్మిది రాత్రులు ఉత్సవాలు నిర్వహిస్తారు. పదవ రోజున విజయదశమి నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగను హిందూ క్యాలెండర్ నెల అశ్వినాలో పదవ రోజున దేశమంతా నిర్వహించుకుంటూ ఉంటుంది. ఇది సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ గ్రెగోరియన్ నెలలో వస్తుంది. చాముండేశ్వరి మహిషాసురుడిని వధించిన రోజు విజయ దశమి అని చెబుతుంటారు.

మైసూర్ దసరా ఉత్సవంలో భాగంగా జారీ చేసే గోల్డ్ కార్డ్ గురించి తెలుసుకుందాం. అసలు గోల్డ్ కార్డ్ ఎవరు జారీ చేస్తారు? దాని వలన మనకు ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం. గోల్డ్ కార్డ్ అంటే జంబూ రైడ్ ఊరేగింపు కోసం సీటింగ్ ఏర్పాట్లతో పాటు ప్యాలెస్ ప్రాంగణానికి ప్రవేశం కూడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ గోల్డ్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. మైసూర్ జిల్లా యంత్రాంగం ఈ గోల్డ్ కార్డులను జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా గోల్డ్ కార్డ్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మైసూర్‌తో పాటు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు కూడా దసరా మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు కానీ మైసూర్‌లో జరిగినంత వైభవంగా మాత్రం జరగదు.

Share this post with your friends