అఖండ దీపం అంటే ఏంటి? ఎలా వెలిగించాలి?

అఖండ దీపం గురించి తెలియని వారు ఉండరు. వినాయక చవితి సమయంలో వినాయకుడి వద్ద.. అలాగే నవరాత్రులు వంటివి నిర్వహించినప్పుడు కచ్చితంగా అఖండ దీపం వెలిగిస్తారు. ఈ అఖండ దీపాన్ని నవరాత్రులన్ని రోజులు కొండెక్కకుండా చూసుకుంటారు. మరి అంతటి ప్రాధాన్యతను ఇచ్చే అఖండ దీపం అంటే ఏమిటి? అఖండ దీపాన్ని వెలిగించడానికి ముందు ఏం చేయాలి? వెలిగించిన తర్వాత ఏం చేయాలో చూద్దాం.

మన కష్టాలు తొలగిపోవాలన్నా, జీవితంలో తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి తీరాలన్నా.. అఖండ దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. కనీసం 24 గంటల పాటు దీపం కొండెక్కకుండా వెలిగితే దానిని అఖండ దీపం అంటారు. ఇక దీనిని ఎలా వెలిగించాలంటే.. ముందుగా ఇత్తడి పళ్లెం తీసుకుని అందులో బియ్యం లేదా ధాన్యం పోయాలి. ఆ తరువాత ఓ పళ్లెంలో బియ్యం మీద ఉంచి ఇత్తడి లేదా మట్టి దీపాన్ని దానిపై ఉంచాలి. ఆ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి, పువ్వులతో అలకరించి దానిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి లావుపాటి వత్తి వేసి దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి. దీపం వద్ద నైవేద్యం పెట్టాలి.

Share this post with your friends